ఆదివారం 24 జనవరి 2021
Crime - Jan 12, 2021 , 12:23:40

జ‌మ్మికుంట‌లో ఇద్ద‌రు బాలిక‌లు అదృశ్యం

జ‌మ్మికుంట‌లో ఇద్ద‌రు బాలిక‌లు అదృశ్యం

క‌రీంన‌గ‌ర్ : జ‌జిల్లాలోని జ‌మ్మికుంట మండ‌లం గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన ఇద్ద‌రు బాలిక‌లు అదృశ్య‌మ‌య్యారు. సోమ‌వారం సాయంత్రం ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు.. త‌మ గ్రామం నుంచి పొరుగున ఉన్న పాపాక్క‌ప‌ల్లికి వెళ్లారు. రాత్రి ఏడు గంట‌ల స‌మ‌యానికి కూడా వారిద్ద‌రూ తిరిగి రాలేదు. దీంతో ఆందోళ‌న చెందిన ఆ బాలిక‌ల గ్రాండ్ పేరెంట్స్ జ‌మ్మికుంట పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. రాత్రి ఏడు గంట‌ల త‌ర్వాత వారి మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ అయిన‌ట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రి త‌ల్లిదండ్రులు జీవ‌నోపాధి కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. దీంతో అక్కాచెల్లెళ్లు ఇద్ద‌రూ త‌మ తాత ఇంట్లో ఉంటున్నారు. అదృశ్య‌మైన వారిని సామ కృష్ణ‌శ్రీ(15), సామ వైష్ణ‌వి(14)గా పోలీసులు గుర్తించారు. కృష్ణ‌శ్రీ ప‌దో త‌ర‌గ‌తి, వైష్ణ‌వి తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతోంది.


logo