యమునా ఎక్స్ప్రెస్ హైవేపై రెండు బస్సుల ఢీ..

మధుర : ఆగ్రా - ఢిల్లీ యమనా ఎక్స్ప్రెస్ హైవేపై గురువారం ఉదయం ఘోర దుర్ఘటన జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ఓ బస్ను మరో బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 12 మంది గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండడంతో ప్రమాదం జరిగింది. బాల్డియో పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు బస్ నోయిడా నుంచి ఆగ్రాకు వెళుతోంది. ఆగి ఉన్న బస్ను ఢీకొట్టుకోవడంతో ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. పోలీసులు, స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో గురువారం దట్టమైన పొగమంచు కప్పివేసింది. తెల్లవారు జామున కనిష్ఠ ఉష్ణోగ్రత 3.2గా నమోదైంది. పలు చోట్ల 4.4డిగ్రీలకు చేరింది.
Mathura: One man died, around 12 injured after a bus rammed into another vehicle due to low visibilty due to fog, at Yamuna Expressway in Baldeo Police station area this morning. The bus was going from Noida to Agra when the incident took place. pic.twitter.com/c9Vycz9U5z
— ANI UP (@ANINewsUP) January 14, 2021
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు
- నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ.. జగపతి బాబు లుక్ వైరల్
- 1.28 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- తెలంగాణ ఎంసెట్ సిలబస్ తగ్గింపు?
- నల్లగొండలో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..