Road Accident in Una | హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఉనాకు ఆనుకొని ఉన్న కుతార్ కలాన్‌లో శనివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఐదుగురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారు.. కుతార్ కలాన్‌లో శనివారం రాత్రి స్తంభాన్ని ఢీకొని పొలాల్లోకి చొక్కుకు వెళ్లింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న యువకులు బయటకు తీశారు. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగురిని ఉనా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరో ముగ్గురు యువకులు చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యా్ప్తు చేస్తున్నామని డీఎస్పీ అంకిత్ శర్మ తెలిపారు.