E-Pantry | ఇకపై రైళ్లలో సులువుగా ఫుడ్ ఆర్డర్.. ఇ-ప్యాంట్రీ సేవలు అందుబాటులోకి
E-Pantry | భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ (IRCTC) ఇ-ప్యాంట్రీ (E-Pantry) సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలుత వివేక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఈ సేవలను ప్రారంభించారు.
E-Pantry : భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ (IRCTC) ఇ-ప్యాంట్రీ (E-Pantry) సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలుత వివేక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఈ సేవలను ప్రారంభించారు. మొత్తం 25 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్యాంట్రీ కార్ కలిగిన ఎంపిక చేసిన రైళ్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
కన్ఫామ్ టికెట్, ఆర్ఏసీ, పాక్షికంగా టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులు ఇ-ప్యాంట్రీ ద్వారా ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. ప్యాంట్రీ కార్ స్టాఫ్ సీటు దగ్గరకే ఆహారాన్ని డెలివరీ చేస్తారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో ‘బుక్డ్ టికెట్ హిస్టరీ’ సెక్షన్లో ఇ-ప్యాంట్రీ మీల్ ఆప్షన్ కనిపిస్తుంది. మీల్ బుక్ చేసుకున్నాక మీల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాన్ని డెలివరీ సమయంలో చూపించాలి.
విశాఖ నుంచి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ కూడా ఈ జాబితాలో ఉంది. దశల వారీగా మిగిలిన రైళ్లకూ ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఇ-ప్యాంట్రీ ద్వారా స్టాండర్డ్ లేదా రైల్నీర్ను బుక్ చేసుకోవచ్చు. ట్రెయిన్ ఎక్కాక ఆహారం కోసం ఆలోచన చేయాల్సిన అవసరం తప్పుతుంది. డిజిటల్ మోడ్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఆన్లైన్లో మీరు ఫుడ్ బుక్ చేసుకోగానే మీకు మీల్ వెరిఫికేషన్ కోడ్ అందుతుంది.
మీల్ ఆర్డర్ నుంచి డెలివరీ వరకు ట్రాకింగ్ ఉంటుంది. ఏదైనా కారణంతో ఫుడ్ డెలివరీ అవ్వకపోతే ఆ సమాచారం కూడా ఎస్సెమ్మెస్/ ఇ-మెయిల్ ద్వారా సమాచారం వస్తుంది. ఆన్లైన్లోనే రిఫండ్ అయిపోతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

