వికారాబాద్ : రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన పద్మం వెంకటేశం (25) కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయాడు. వికారాబాద్, గోదుమ గూడ రైల్వే స్టేషన్ల మధ్య కిలో మీటర్ నం. 109/19-17 వద్ద గుర్తు తెలియని రైలు ఢీ కొనడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, 15రోజుల బాబు ఉన్నాడు.