Suicide | పిల్లలకు పురుగులమందు తాగించి…ఉరేసుకున్న తండ్రి..

దామరచర్ల: కుటుంబ కలహాలతో క్షణికావేశం ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. ఆ ఆవేశమే తండ్రి చేతుల్లో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను చిదిమేసింది. ఈసంఘటన మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నూనావత్ తండాకు చెందిన గేరి కిషన్(35) తన ఇద్దరు కుమారులైన హర్షవర్దన్(8) అఖిల్(6)లకు కూల్ డ్రింక్ లో పురుగులమందు కలిపి తాగించాడు. వాళ్లిద్దరూ చనిపోయిన తర్వాత తానూ చెట్టుకు ఉరివేసుకొని బలవర్మణానికి పాల్పడ్డాడు.
నూనావత్ తండాకు చెందిన కిషన్ అదే తండాకు చెందిన భూలక్ష్మీతో గత పదేండ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలం వారి జీవనం సజావుగా సాగింది. కిషన్ కొన్నాళ్లుగా తన ఎకరన్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. పిల్లలు కొండ్రపోల్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. గురువారం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి తిరిగి రాగానే వారికి బట్టలు, తినుబండారాలు కొనిస్తానని తండ్రి బయటకు తీసుకెళ్లాడు.
ముగ్గురు ఎంతసేపటికీ తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లు వెతికినా కనిపించలేదు. ఉదయం పొలం వద్ద ముగ్గురు మృతదేహాలను చూసిన తండా వాసులు సమాచారం అందించారు. సంఘటనా స్థలం వద్ద మజా బాటిల్ ఉంది. కిషన్ చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. వాడపల్లి ఇంచార్జీ ఎస్ఐ వీరశేఖర్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ దవాఖానకు తరలించారు. మృతుడు కిషన్ తల్లి నాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

