Road Accident | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి కుమారుడు మృతి చెందారు.
నాందేడ్ – అఖోలా 161వ జాతీయ రహదారిపై ఆందోల్ మండలం రామ్‌సాన్‌పల్లి వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు, వారి కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను మద్దూరుకు చెందిన శ్రీనివాస్(32), సునీత(30), నగేశ్(8)గా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.