Knife attack | కత్తిపోట్లకు దారి తీసిన ఘర్షణ

అడ్డగుట్ట : ఇద్దరు మైనర్ బాలుర మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎల్లప్ప కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఇబ్రహీం (16), షేక్ షాగీర్ (16) ఇద్దరు స్నేహితులు వీరిద్దరు కలిసి అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదివారు.
షాగీర్ మధ్యలో చదువు ఆపేశాడు. ఇబ్రహీం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్లో 10వ తరగతి చదువుతున్నాడు. పదిహేను రోజుల క్రితం ఇబ్రహీం అడ్డగుట్టలోని తన ఇంటికి వచ్చాడు. అయితే షాగీర్ అమ్మాయిలను తరుచు టీజ్ చేస్తున్నాడని తెలిసి ఇబ్రహీం అతన్నిఅలా చేయడం సరికాదని చెప్పాడు.
దీనిపై వారిద్దరి మధ్య గొడవ జరుగుతూ వస్తుంది. ఇదిలా ఉండగా ఈ నెల 8న రాత్రి 9 గంటల సమయంలో మళ్లీ ఇదే విషయమై ఇబ్రహీం, షాగీర్కు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షాగీర్ కత్తితో ఇబ్రహీంపై దాడి చేశాడు. ఇబ్రహీంకు ఎడమవైపు కడుపులో, తలపై గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇబ్రహీంని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు షాగీర్పై కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. షాగీర్ మైనరు కావడంతో జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

