police case | స్నేహితుడిని బెదిరించి లక్ష వసూలు చేసిన బాలుడు

బంజారాహిల్స్ : తనకు డబ్బులు ఇవ్వకపోతే రోజూ కొడుతుంటానంటూ పదమూడేళ్ల బాలుడు తన స్నేహితుడిని బెదిరించి రూ.1లక్ష తీసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జహీరానగర్‌లో నివాసం ఉంటూ మెకానిక్‌గా పనిచేస్తున్న మహ్మద్ నిజాముద్దీన్ కొడుకు (13) స్థానికంగా ఉన్న క్రిసెంట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 28న నిజాముద్దీన్ బీరువాలో పెట్టిన రూ.లక్ష మాయమయ్యాయి.
మరుసటిరోజు ఉదయం కొడుకును అడగ్గా తనతో పాటు చదువుకుంటున్న స్నేహితుడు (13) కు డబ్బులు ఇచ్చానని చెప్పాడు. రోజూ తనను కొడుతున్నాడని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించడంతో డబ్బులు ఇచ్చినట్లు చెప్పడంతో షాక్‌కు గురయిన తండ్రి నిజాముద్దీన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు బాలుడిపై ఐపీసీ 384సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

