బైక్‌ను ఢీకొట్టి.. వంతెనపై నుంచి కాలువలోపడ్డ యూఎస్వీ.. ఆరుగురు మృతి
అమరావతి : మహారాష్ట్ర అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ ఆ తర్వాత.. వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. పరత్వాడా – బేతుల్ హైవేపై నింభోరా ఫాటా (మళ్లింపు) ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో తక్కువ దృశ్యమానత మధ్య ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందారన్నారు. షిరాజ్గావ్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన పెట్రోలింగ్ పార్టీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో రోడ్డుపై పడి ఉన్న ఎస్యూవీ సీటు పడి ఉండడాన్ని గమనించింది. అందులో గాయపడ్డ వ్యక్తిని కాపాడి.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం అచల్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

