అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ కానిస్టేబుల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. విజయవాడ టూటౌన్ కొత్తపేట పీఎస్ పరిధిలో పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ప్లాట్ నుంచి దూకి ట్రాఫిక్ కానిస్టేబుల్ సొంటి వీరబాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. టూటౌన్ కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.