కొమురవెల్లి, మే6 : భార్యతో గొడవపడి గొంతు కొసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం నాగపురికి చెందిన బుచ్చెలి కుమార్ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తు్న్నాడు.
కాగా, కొంత కాలంగా భార్య మంజులతో గొడువలు మొదలవడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ ఉండగా అంతలోనే గురువన్నపేట ఎల్లమ్మ ఆలయం ముందు గల మాతమ్మ ఆలయంలోని కత్తితో తన గొంతు కొసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడటంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి బాధితుడిని గజ్వేల్ దవఖానకు తరలించారు. కాగా బాధితుడు కుమార్కు భార్య మంజుల, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.