హైదరాబాద్ : అత్తారింటి వేధింపులు తాళలే ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ఆడ పిల్ల పుట్టిందని అత్తింటి వారు వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సదరు మహిళ భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు.