సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 12:47:15

స్వప్నా సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

స్వప్నా సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

కొచ్చి: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్నా సురేశ్ బెయిల్ పిటిషన్‌ను కొచ్చిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. స్వప్నా సురేశ్ బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. దుబాయ్ నుంచి దౌత్య సామగ్రిలో బంగారం చాలాసార్లు అక్రమంగా రవాణా జరిగినట్లు ఆధారాలున్నాయని, ఇది భారతదేశ ఆర్థిక భద్రతకు ముప్పు అని నిందితులకు తెలుసని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ పేర్కొన్న అభియోగాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపింది. కేసు డైరీ, సాక్ష్యాల ఆధారంగా స్వప్నా సురేశ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు పేర్కొంది.






logo