Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం : ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
రాజస్ధాన్‌లోని హనుమాన్‌ఘఢ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకే కుటుంటానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు.
జైపూర్ : రాజస్ధాన్‌లోని హనుమాన్‌ఘఢ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఒకే కుటుంటానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మరణించారు. హనుమాన్‌ఘఢ్-సర్ధార్షహర్ హైవేపై వారు ప్రయానిస్తున్న కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు. శనవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్ధలానికి చేరుకున్నామని పోలీసులు చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో పిల్లలతో సహా 9 మంది కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో ఏడుగురు కుటుంబసభ్యులు ఘటనా స్ధలంలోనే మరణించగా ఇద్దరికి గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న కారు సిమెంట్ లోడ్‌తో వెళుతున్న ట్రక్‌ను ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
గాయపడిన ఇద్దరిని ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బికనీర్ ఆస్పత్రికి తరలించారు. ట్రక్ అతివేగంతో దూసుకెళ్లడం వలనే ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాధిత కుటుంబం రాజస్ధాన్‌లోని హనుమాన్‌ఘఢ్ సమీపంలో నురంగ్దేశర్ గ్రామానికి చెందినదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Devara Movie | దేవర సినిమాలో మంచు లక్ష్మీ.. ఇది నిజమైతే అరాచకమే..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- car
- collision
- Road Accident
- Truck
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

