Devara Movie | ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మాములు అంచనాల్లేవు. దానికి తోడు మరో వైపు పలు లీకుల ప్రవాహంతో సినిమాపై అంతకంతకూ హైప్ పెరుగుతూనే ఉంది. ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటివరకు మనం చూడని యాక్షన్ సీన్లను దేవర టీమ్ డిజైన్ చేస్తుందట. తారక్ సైతం వాటికోసం ప్రత్యేకించి శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇక అండర్ వాటర్ సీన్ అయితే మరో అద్భుతమట. సిల్వర్ స్క్రీన్‌పై ఆ సన్నివేశం చూసినప్పుడు సీట్లలో ఒక్కరు కూడా కూర్చోరట. ఇలాంటి లీకులు నందమూరి అభిమానుల్లోనే కాదు సగటు ఆడియెన్స్‌లో సైతం అంతులేని అంచనాలు నెలకొల్పుతున్నాయి.
ప్రస్తుతం ఎడతెరపు లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను కొనసాగిస్తున్నారట. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూ్ల్స్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అదే స్పీడ్‌తో ముందుకు కదులుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ ఓ కీలక రోల్ చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. దేవరలో ఎన్టీఆర్‌కు ఒక అక్క ఉంటుందట. ఆ పాత్రే సినిమాను నడిపిస్తుందట. ఇక అదే రోల్ మంచు లక్ష్మి దగ్గరికి వెళ్లిందట. తను కూడా ఆ రోల్‌పై సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అదే గనుక నిజమైతే మంచు లక్ష్మి క్రేజ్ పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లడం ఖాయం.
సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌కు జోడీగా జాన్వీకపూర్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాను యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు.