కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ సబ్ స్టేషన్ ఎదుట ఉన్న వైన్ షాప్ వద్ద ఒకరిపై దాడి( Attack) చేసి తీవ్రంగా గాయపరిచిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారాం( SI Gangaram) తెలిపారు.
వైన్ షాప్ వద్ద దేవాపూర్ గ్రామానికి చెందిన బోర్లకుంట ప్రణయ్, జంగు అనే వ్యక్తులు డబ్బుల విషయంలో గొడవ పడుతుండగా అడ్డుకోబోయిన అచ్యుర్రావు గూడెంకు చెందిన గూడెం రామచందర్‌పై రాంటెంకి చంద్రయ్య, చునార్కర్ రాజేష్, జాడి కిరణ్, దుర్గం శేఖర్, బోర్లకుంట ప్రవీణ్, జాడి సాగర్ అనే వ్యక్తులు దాడి చేశారు. అతడిని చితకబాది మద్యం బాటిల్‌తో కొట్టారు.
దీంతో తీవ్రంగా గాయపడ్డ రాంచందర్ రామచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు గతంలో కూడా నేర చరిత్ర కలిగిన నిందితుడు బోర్లకుంట ప్రణయ్‌పై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నామని వెల్లడించారు.