30 ఇండ్లలో చోరీలకు తెగబడి ఆపై ఫ్లాట్ కొనేందుకు ప్లాన్ చేశాడు కానీ..

ముంబై : అతడో ఘరానా దొంగ..తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేయడంలో చేయితిరిగిన నేరగాడు. 30కిపైగా ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన అతడు తాను ఓ ఇంటివాడయ్యేందుకు స్కెచ్ వేశాడు. చోరీ సొత్తుతో ఫ్లాట్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. మహారాష్ట్రలోని పుణే జిల్లా పింప్రి చించ్వాడ్ పోలీసులు ఘరానా దొంగ ఆటకట్టించారు.
నిందితుడిని లఖన్ అశోక్ జెతిధోర్గా గుర్తించిన పోలీసులు అతడి నుంచి ఓ ఎస్యూవీ, 780 గ్రాముల బంగారం, రూ 77 లక్షల విలువైన ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన ఇండ్ల వద్ద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఓ తినుబండారాల దుకాణం వద్ద నిందితుడు కనిపించగా సీసీటీవీ ఫుటేజ్లోని అనుమానితుడితో పోల్చుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇండ్లలో చోరీల ద్వారా సంపాదించిన మొత్తంతో ఫ్లాట్ కొనుగోలు చేయాలని నిందితుడు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. చోరీ సొత్తును కొనుగోలు చేసిన ఇద్దరు జ్యూవెలర్లను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arest
- Burglar
- Maharashtra
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

