శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో 17.69 లక్షల విలువైన స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్ అధికారులు ఓ మహిళా స్మగ్లర్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం…ఓ మహిళా ప్రయాణీకురాలు హైదరాబాద్కు దుబాయ్ నుంచి 6ఇ 025 ఇండిగో విమానం ద్వార వచ్చింది.
సదరు ప్రయాణీకురాలిపై అనుమానంతో తనిఖీ చేసి అదుపులోకి తీసుకున్నారు. హ్యాండ్బ్యాగ్ లో బంగారం గుర్తుపట్ట కుండా వెయింగ్ మెషిన్లో దాచింది. కస్టమ్స్ నిఘాపెట్టి చేసిన తనిఖీలో బంగారాన్ని గుర్తించి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న 3 బంగారం బిస్కట్ల పరిమాణం 350 గ్రాముల బరువు ఉంది. వాటి విలువ రూ .17,69 లక్షలు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.