ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కొందరు ఒక ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం స్వల్పంగా దగ్దమైందని అధికారులు తెలియజేశారు.
బస్సు తగలబడటం గమనించిన స్థానికులు వెంటనే ముందుకొచ్చి.. మంటలు మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ బస్సుకు నిప్పుపెట్టిన దుండగుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఎవరైనా ఆకతాయిల పనా…? లేక మావోయిస్టుల దుశ్చర్యా..? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.