మునిపల్లి/సంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటు చేసుకుంది. లారీ కింద పడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మునిపల్లిలోని ముంబై జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
స్థానికులు వెంటనే మునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.