బెంగళూర్ : రోజుకో స్కామ్‌తో అమాయకులను నిండా ముంచేస్తున్న సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) ఏకంగా రిటైర్డ్ ఆర్మీ అధికారి నుంచి రూ. 3 లక్షలు కొట్టేశారు. అమెరికాలోని బంధువులమని చెబుతూ స్కామర్లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని మోసగించారు. బాధితుడిని కర్నాటకలోని బిల్లమరనహళ్లికి చెందిన కెప్టెన్ (రిటైర్డ్) రంజింత్ సింగ్ (64)గా గుర్తించారు. ఈనెల 17న సింగ్‌కు కాల్ చేసిన నిందితుడు తాను సుఖ్వీందర్సింగ్నని, బాధితుడికి బంధువునని నమ్మబలికాడు.
అతడి ఫోన్ కాల్ న్యూయార్క్ నెంబర్‌ను సూచించడంతో రిటైర్డ్ ఆర్మీ అధికారి నిజమేనని నమ్మాడు. తాను త్వరలోనే భారత్‌కు వస్తున్నానని అక్కడికి వచ్చే ముందు మీ బ్యాంకు ఖాతాలో కొంత మొత్తం జమ చేస్తానని చెబుతూ బ్యాంక్ ఖాతా వివరాలు రాబట్టాడు. ఆపై కొద్దిసేపటికి సింగ్ ఖాతాలో రూ. 25 లక్షలు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇక ఎస్బీఐ ఎగ్జిక్యూటివ్ అంటూ కెప్టెన్ సింగ్‌కు ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 24 గంటల తర్వాత ఈ మొత్తం మీ ఖాతాలో కనిపిస్తుందని చెప్పాడు.
ఇక కెప్టెన్ సింగ్‌కు మరోసారి విదేశీ నెంబర్ నుంచి కాల్ చేసిన స్కామర్ పాస్‌పోర్ట్ సమస్యల కారణంగా రూ. 5 లక్షలు తాను చెప్పిన ట్రావెల్ ఏజెంట్ ఖాతాకు బదిలీ చేయాలని ఆ మొత్తాన్ని తాను పంపిన రూ. 25 లక్షల నుంచి మినహాయించుకోవాలని కోరాడు. రూ. 3 లక్షలను కెప్టెన్ సింగ్ సర్ధుబాటు చేయడంతో మిగిలిన రూ. 2 లక్షల కోసం స్కామర్ ఒత్తిడి చేశాడు. అనుమానం వచ్చిన సింగ్ విదేశాల్లో ఉన్న తన బంధువు సుఖ్వీందర్ సింగ్‌కు ఫోన్ చేయగా తాను అసలు కెప్టెన్ సింగ్‌కు కాల్ చేయనే లేదని బదులివ్వడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read More :
Pradeep Sharma: ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు.. పోలీసు ఆఫీసర్‌కు సుప్రీం బెయిల్