Pradeep Sharma: ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాలు.. పోలీసు ఆఫీసర్‌కు సుప్రీం బెయిల్
Mumbai Cop Pradeep Sharma: యాంటిల్లా బాంబు బెదిరింపు కేసులో ముంబై ఆఫీసర్ ప్రదీప్ శర్మకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. జస్టిస్ ఏఎస్ బొపన్న నేతృత్వంలోని ధర్మాసనం ఆ తీర్పును వెలువరించింది. ముఖేశ్ అంబానీ ఇంటి ముందు ఆగి ఉన్న ఎస్‌యూవీలో బాంబులను గుర్తించిన కేసులో ప్రదీప్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
న్యూఢిల్లీ: ముంబై మాజీ పోలీసు ఆఫీసర్ ప్రదీప్ శర్మ(Pradeep Sharma)కు.. సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరీ చేసింది. యాంటిల్లా బాంబు బెదిరింపు కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సూక్ హిరన్ హత్య కేసులో ప్రదీప్ నిందితుడిగా ఉన్నాడు. 2021, ఫిబ్రవరి 25వ తేదీన దక్షిణ ముంబైలోని యాంటిల్లాలో ఉన్న రిలయన్స్ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద ఆగి ఉన్న ఎస్‌యూవీలో పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఏఎస్ బొప్పన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. పోలీసు ఆఫీసర్ ప్రదీప్ శర్మకు జూన్‌లో సుప్రీంకోర్టు మూడువారాల తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చింది.
ప్రదీప్ శర్మతో పాటు దయా నాయక్, విజయ్ సల్సాకర్, రవీంద్రనాథ్ ఆంగ్రేలపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆఫీసర్లు ముంబైలో చాలా వరకు ఎన్కౌంటర్లు చేసినట్లు కేసులు ఉన్నాయి. ఈ బృందం దాదాపు 300 మంది నేరస్థుల్ని ఎన్కౌంటర్ చేశారు. అయితే యాంటిల్లా కేసుతో లింకు ఉన్న పోలీసు ఆఫీసర్ సచిన్ వాజేను డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. హిరన్ను హత్య చేసిన ఆరోపణలపై ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కేసుతో లింకు ఉన్న ప్రదీప్ శర్మను 2021 జూన్‌లోనే అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

