Sajjan Jindal | హైకోర్టు జోక్యంతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై లైంగిక వేధింపుల కేసు
లైంగిక దాడి ఆరోపణలపై పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎండీ సజ్జన్ జిందాల్‌పై (Sajjan Jindal) కేసు నమోదైంది.
ముంబై : లైంగిక దాడి ఆరోపణలపై పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఎండీ సజ్జన్ జిందాల్‌పై (Sajjan Jindal) కేసు నమోదైంది. జిందాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ముంబైకి చెందిన మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో ఆపై బాంబే హైకోర్టును ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా..2021లో దుబాయ్‌లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా వీరు తొలిసారి వీఐపీ బాక్స్‌లో కూర్చుండగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత వీరు పలుమార్లు కలుసుకున్న క్రమంలో పెండ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన జిందాల్ ఆమెకు దగ్గరయ్యాడు. తనను లోబరచుకునేందుకు జిందాల్ చేస్తున్న ప్రయత్నాలను తాను నిలువరించడంతో 2022 జనవరి 24న తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. ఆపై తనను క్షమాపణ కోరినా తర్వాత తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ తనను బెదిరించి తన కాంటాక్ట్‌ను బ్లాక్ చేశాడని పేర్కొంది.
జిందాల్‌పై ఫిర్యాదు చేసేందుకు ఆమె పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని మహిళ తరపు న్యాయవాది మర్చంట్ కోర్టుకు నివేదించారు. ముంబైలో ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరించిన మూడు పోలీస్ స్టేషన్లకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులకు అంతకుముందు జస్టిస్ పీడీ నాయక్, ఎన్ఆర్ బొర్కార్ సమన్లు జారీ చేశారు. కోర్టు జోక్యంతో బీకేసీ పోలీస్ స్టేషన్లో జిందాల్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో దర్యాప్తును వేగవంతం చేయాలని హైకోర్ట్ బెంచ్ ఆదేశించింది.
Read More :
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

