ఇబ్రహీంపట్నంరూరల్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని నెరపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నెరపల్లి గ్రామానికి చెందిన బద్దుల బాలయ్య(60) నాలుగైదు రోజులుగా ఇంట్లో భార్యభర్తల మధ్య జరుగుతున్న గొడవలతో మనస్థాపానికి గురై బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.