ముంబై : సైబర్ నేరగాళ్లు పోలీసుల కండ్లు గప్పి ఆన్లైన్ వేదికగా అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలు (Cyber Fraud) పెరుగుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్గా పుణేలో ఓ టెకీని మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయమైన మహిళ పెండ్లి పేరుతో ఏకంగా రూ. 91 లక్షలు కొట్టేసింది.
పెండ్లి చేసుకుంటానని నమ్మబలికిన మహిళ లాభాల ఆశ చూపి పెద్దమొత్తంలో టెకీచే ఇన్వెస్ట్ చేయించిన మహిళ ఆపై డబ్బు దండుకుని ఉడాయించింది. జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే మ్యాట్రిమోనియల్ సైట్ వేదికగా టెకీని మహిళ నిలువునా ముంచింది. పుణేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ మహిళ పరిచయం కాగా ఆమె సలహాతో రూ. 91.75 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.
టెకీని పెండ్లి చేసుకుంటానని నమ్మబలికిన మహిళ ఆపై బ్లెస్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే పెండ్లి తర్వాత మనకు మంచి భవిష్యత్ ఉంటుందని మభ్యపెట్టింది. ఆమె మాటలు నమ్మిన టకీ బ్యాంకులతో పాటు లోన్ యాప్‌ల నుంచి పెద్దమొత్తంలో నిధులు సమీకరించి ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని రోజులైనా తనకు రిటన్స్ రాకపోవడంతో మహిళను నిలదీయగా మరో పది లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెరుగైన రిటన్స్ పొందవచ్చని మభ్యపెట్టింది. ఇక ఆపై మరికొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని కోరడంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read More :
Amarnath Yatra | అనుకూలించని వాతావరణం.. వరుసగా మూడో రోజూ సాగని అమర్నాథ్ యాత్ర