మహబూబ్నగర్ : రూరల్ మండలం దివిటిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 14 మందిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్లో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏపీలోని పులివెందుల నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకున్నది. బస్సు బోల్తాపడడానికి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.