చెత్తలో దొరికిన కాగితంతో హత్యకేసుని ఛేదించిన పోలీసులు
POLICE | హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌తో పోలీసులు నేరస్థుడిని

కొన్నిసార్లు మనం క్లిష్టమైన సమస్యలకు సమాధనం దొరకక సతమతమవుతున్నప్పుడు అనుకోకుండా దానికి ఏదో సులువైన సమాధానం దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితే హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు ఎదురైంది. హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌తో పోలీసులు నేరస్థుడిని పట్టుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాన్వాలీ గ్రామంలో ఒక అద్దె ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లగానే అక్కడ కుళ్లి పోయిన శవం కనపడింది.
ఉంటున్న ఒక మహిళ హత్యకు గురైంది. స్థానిక పోలీసులు హత్య జరిగిన ఇంట్లో ఎంత వెతికినా ఏ ఆధారం దొరకకపోవడంతో ఒక సమయంలో హత్యకేసు ఫైల్ని మూసేయబోయారు. కానీ చివరి ప్రయత్నంగా మళ్లీ హత్య ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులకు అక్కడి చెత్తకుండీలో ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్ గల వ్యక్తిని అనుమానించి.. అతడిని పట్టుకున్నారు. పట్టుబడిన ఆ నిందితుడు.. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గీతా(36) అనే మహిళకు 2003లో ఆ రాష్ట్రంలోని రాంబీర్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక గీత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్దీ అనే నగరంలో ఉద్యోగం చేయడానికి వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో కౌశల్ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంత కాలం తరువాత కౌశల్ ఆమెను వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కౌశల్ మిత్రుడైన హసన్ అనే ముస్లిం వ్యక్తితో ఒకే ఇంట్లో అద్దెకు ఉండేది.
హసన్ ఆమెను పెళ్లిచేసుకుంటానని.. అందుకు ముందుగా ఇస్లాం మతంలో మారాలని ఒత్తిడి చేసేవాడు. గీతా ఇందుకు అంగీకరించకపోవడంతో.. ఒకరోజు ఆమెను కత్తితో గొంతుకోసి |హసన్ హత్యచేశాడు. ఆ తరువాత ఆధారాల్లన్నీ మాయం చేసి, ఇంటికి తాళం వేసి ఉత్తర్ ప్రదేశ్ పారిపోయాడు. హత్య జరిగిన వారం రోజుల తరువాత పోలీసులకు సమాచరం అందింది. అప్పటికి గీతా శవం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ ఇంట్లో ఉన్న చెత్తలో ఒక కాగితంపై ఉన్న హసన్ ఫోన్ నెంబర్‌తో అతడిని పోలీసులు పట్టుకున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Himachal pradesh
- junk
- murder
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

