ప్రజలను రక్షించాల్సిన పోలీసులే.. మందు మత్తుకు బానిసలైపోయారు. ఎక్కడా చోటు దొరకనట్లు ఏకంగా పోలీస్ అవుట్ పోస్టులోనే బార్ తెరిచారు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వెలుగు చూసింది. ఆదివారం సాయంత్రం ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సహా మొత్తం నలుగురు అధికారులు కలిసి మందు పార్టీ చేసుకున్నారు.
అహ్మదాబాద్ సమీపంలోని అవుట్ పోస్టులో ఈ నలుగురు పోస్టింగ్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా నలుగురూ కలిసి మందు పార్టీ చేసుకోవడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట ప్రత్యక్షం అవడంతో.. పైఅధికారులు వెంటనే స్పందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ అవుట్ పోస్టును చేరుకున్నారు. అక్కడ మద్యం మత్తులో పడిపోయి ఉన్న నలుగురు అధికారులను అదుపులోకి తీసుకున్నారు.