గురువారం 21 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 15:41:48

పాకిస్తాన్‌లో దారుణం : పెండ్లికి నిరాకరించిన క్రిస్టియన్‌ యువతి హత్య

పాకిస్తాన్‌లో దారుణం : పెండ్లికి నిరాకరించిన క్రిస్టియన్‌ యువతి హత్య

ఇస్లామాబాద్: స్థానిక ముస్లిం వ్యక్తి పంపిన వివాహ ప్రతిపాదనకు తిరస్కరణ ఎదురవడంతో పాకిస్తాన్‌లో ఒక క్రైస్తవ యువతి దారుణహత్యకు గురైంది. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధ్రువీకరించారు.  రావల్పిండిలోని కోరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆదివారం జరిగింది. పోలీసు అధికారులు ఫైజాన్ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు సమాచారం. 

కోరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే షెహజాద్‌ అనే యువకుడు స్థానికంగా నివసించే క్రైస్తవ యువతిని పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకు ఆ యువతి కుటుంబం తిరస్కరించడంతో షెహజాద్‌ ఆగ్రహం చెందాడు. యువతి వివాహం మరో యువకుడితో జరిపేందుకు సిద్ధమైనట్లుగా తెలియడంతో షెహజాద్‌ సదరు యువతిపై కోపం పెంచుకున్నాడు. మరుసటి రోజు ఫైజాన్‌ అనే యువకుడి బైక్‌పై వెళ్తుండగా గమనించిన షెహజాద్‌.. ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వ్యక్తిగత కోపం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ చెప్పారు. గత నెలలో, కరాచీలో 44 ఏండ్ల ముస్లిం వ్యక్తిని అర్జు రాజా అనే యువ క్రైస్తవుడు అపహరించి, బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్నట్లు తెలిసింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo