స్ధూల ఆర్ధిక వాతావరణం అనుకూలంగా ఉండటంతో భారత్ 2025 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్దగా అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ అంచనా వేశారు. 2022లో బ్రిటన్ను అధిగమించిన భారత్ ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఐదో అతిపెద్ద ఆర్దిక వ్యవస్ధగా నిలిచింది.
భారత్ ప్రస్తుత జీడీపీ 3.7 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. రికార్డ్ జీఎస్టీ వసూళ్లు, గత మూడు క్వార్టర్లలో 8 శాతం వృద్ధి రేటు, పలు దేశాలతో భారత రూపాయల్లో వాణిజ్యం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వంటి అంశాలు భారత్ జీడీపీ పెరుగుదల కొనసాగేందుకు దోహదపడతాయని అమితాబ్ కాంత్‌తో పాటు పలువురు ఆర్ధిక నిపుణుల అంచనా వేస్తున్నారు.
స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో రెండంకెల వృద్ధి, ఈ-లావాదేవీలు 134 బిలియన్లకు ఎగబాకడంతో పాటు డిజిటల్ పబ్లిక్ మౌలికవసతుల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదగడం, గ్లోబల్ డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతానికి పైగా వాటా భారత్ కలిగిఉండటం వంటి సానుకూల అంశాలతో భారత జీడీపీ వృద్ధి రేటు నిలకడగా కొనసాగే అవకాశం ఉందని అమితాబ్ కాంత్ అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్ధాయిలో రాజకీయ స్ధిరత్వం, మెరుగైన కేంద్ర బ్యాంక్ ద్రవ్య విధానం వంటివి భారత ఆర్ధిక వ్యవస్ధ ఇటీవల పలు క్వార్టర్స్‌లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. 2023-24 ఆర్ధిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో భారత జీడీపీ వృద్ధి రేటు అనూహ్యంగా 8.4 శాతంగా నమోదైంది.
Read More :