అమరావతి : ఎన్నికల బందోబస్తులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సీ విజిల్(Sea whistle) ఫిర్యాదుతో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ విశాఖ ఆర్కే బీచ్ పాండురంగపురం వద్ద తనిఖీలు నిర్వహించారు. అటుగా వచ్చిన కారులోని కారులోని వ్యక్తులు అధికారులను చూసి కారును వదిలి పారిపోయారు. అనంతరం కారును తనిఖీ చేయగా అందులో ఉన్న రూ. కోటిన్నర నగదు (Cash Seize) ను పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నగదు ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు పంపించారు. ఎక్కడికి పంపించారు తదితర వివరాలను సేకరిస్తున్నారు.