హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem Dist) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC Bus) అదుపు తప్పి పంట పొలాల్లోకి(Crop fields) దూసుకెళ్లడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన బూర్గంపాడు మండలం మోతె గ్రామ శివారులో చేటు చేసుకుంది. గమనించిన స్థాని కులు క్షతగాత్రులను చికిత్స కోసం బూర్గంపాడు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందు కున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.