సిమ్లా : క్రిప్టో కరెన్సీ స్కామ్‌లో (Cryptocurrency Fraud) పోలీసులు బాధితులుగా మారడం కలకలం రేపింది. మండి జిల్లాలో క్రిప్టోకరెన్సీ స్కీమ్‌లో వేయి మందికిపైగా పోలీసులు చేతులు కాల్చుకున్నారు. కొర్వియో కాయిన్ (కేఆర్ఓ), డీజీటీ కాయిన్‌గా పేరొందిన అక్రమ క్రిప్టోకరెన్సీ లావాదేవీల్లో నిందితులు పెద్దమొత్తంలో సొమ్ము కాజేశారు. ఈ స్కీమ్‌లో నేరుగా పెట్టుబడి పెట్టిన వారు కొందరైతే, స్కీమ్ ప్రమోటర్స్‌గా చేరి పలువురిని ఈ స్కీమ్‌లో మరికొందరు పోలీసులు చేర్పించారు. 2.5 లక్షల యూనిక్ ఐడీలను గుర్తించడంతో నిందితులు కనీసం లక్ష మంది వ్యక్తులను ఈ ఉచ్చులోకి లాగి ఉంటారని అనుమానిస్తున్నారు.
క్రిప్టోకరెన్సీ అక్రమాలకు తెరలేపిన స్కామర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు రెండంచెల వ్యూహం అనుసరించారు. కొర్వియో కాయిన్, డీజీటీ కాయిన్ పేరిట వారు రెండు కాయిన్స్ ప్రవేశపెట్టి ఈ డిజిటల్ కరెన్సీలను తమకు తోచిన ధరలను డిస్ప్లే చేసేందుకు నకిలీ వెబ్సైట్లు రన్ చేశారు. కొద్దిసమయంలోనే మెరుగైన రిటన్స్ అందిస్తామని మభ్యపెడుతూ ముందుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటారు.
ఇక ఆపై ఇన్వెస్టర్ల నెట్‌వర్క్‌ను విస్తరిస్తారు. స్వల్పకాలంలో పెద్దమొత్తంలో ఆర్జించవచ్చనే ఆశతో టీచర్లు, ఇతర వృత్తుల వారి మాదిరే పెద్దసంఖ్యలో పోలీసులు కూడా ఈ స్కీమ్‌లో ఎంట్రీ ఇచ్చి తమకు తెలిసినవారిని కూడా చేర్పించారు. ఈ స్కీమ్‌లో పూర్తిగా నిమగ్నమైన కొందరు పోలీసులు స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకుని స్కీమ్ ప్రమోటర్లుగా మారారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతున్నదని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ సంజయ్ కుందూ వెల్లడించారు. ఎలాంటి క్రిప్టోకరెన్సీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Read More :
Jangaon | జనగామ జిల్లాలో 5.4 కిలోల బంగారం పట్టివేత