Online Gaming Scam | ఆన్లైన్ జూదంలో రూ. 58 కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి
రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా నాగపూర్‌కు చెందిన ఓ వ్యాపారిని ఏకంగా రూ. 58 కోట్లకు (Online Gaming Scam) ముంచేశారు.
ముంబై : సైబర్ నేరాలపై ప్రభుత్వం, పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా ఆన్లైన్ వేదికగా సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. అమాయకులను మభ్యపెడుతూ అడ్డదారుల్లో అందినకాడికి దోచుకుంటున్నారు. రోజుకో తరహా స్కామ్‌తో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా నాగపూర్‌కు చెందిన ఓ వ్యాపారిని ఏకంగా రూ. 58 కోట్లకు (Online Gaming Scam) ముంచేశారు.
ఆన్లైన్ జూదంలో ఫ్రెండ్ చేతిలోనే వ్యాపారి అడ్డంగా మోసపోయారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా అనుమానితుడి ఇంటిపై పోలీసులు దాడి చేసి 14 కిలోల బంగారంతో పాటు రూ. 17 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుడైన బుకీ బాధితుడిని మోసం చేసేందుకు ఆన్లైన్ గేమింగ్ వేదికను సృష్టించాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన వెల్లడిస్తోంది. ఆన్లైన్ గేమ్స్ విషయంలో కొత్త వ్యక్తులను, అపరిచితులను అసలు నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఇన్-గేమ్ ఎక్స్లూజివ్ల పేరిట కొందరు ఇచ్చే ఆఫర్ల వలలో పడకుండా యాప్ ఆధారిత పేమెంట్స్ మాత్రమే చేయాలి. వ్యక్తుల వద్ద నగదుతో ఎలాంటి కొనుగోళ్లు జరపకుండా జాగ్రత్త పడాలి. రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ జూదాలు రిస్క్‌తో కూడుకున్నవి. ఇందులో మీరు గెలుస్తారనే హామీ లేనందను ఇలాంటి జూదాలకు దూరంగా ఉండటం మేలు. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఎవరితోనూ పంచుకోవద్దు.
Read More :
Manipur Files | దమ్ముంటే మణిపూర్ ఫైల్స్ తీయండి.. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి నెటిజన్ సవాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- businessmen
- Crime news
- duped
- Nagpur
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

