Manipur Files | దమ్ముంటే మణిపూర్ ఫైల్స్ తీయండి.. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి నెటిజన్ సవాలు
Manipur Files | జాతుల నడుమ సంఘర్షణతో మణిపూర్ అట్టుడికి పోతున్న విషయం తెలిసిందే. కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.
Manipur Files | జాతుల నడుమ సంఘర్షణతో మణిపూర్ అట్టుడికి పోతున్న విషయం తెలిసిందే. కుకీ మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన అమానవీయ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మీకు దమ్ముంటే మణిపూర్ ఫైల్స్‌ను తీసి చూపించండి’ అంటూ ‘కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ఓ నెటిజన్ సోషల్‌మీడియా వేదికగా నిలదీయడం ఆసక్తికరంగా మారింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్’ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వివరిస్తూ వివేక్ అగ్నిహోత్రి ఓ ట్వీట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ ‘ఎన్ని రోజులు ఇవే సినిమాలు తీస్తావు. నువ్వు మగాడివైతే మణిపూర్ ఫైల్స్‌ను తీసి చూపించు’ అని ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కు వివేక్ అగ్నిహోత్రి బదులిస్తూ ‘అన్ని సినిమాలు నేనే తీస్తా ఎలా..మీ టీమ్ ఇండియాలో చాలా మంది మగవాళ్లు ఉన్నారు కదా’ అంటూ వ్యంగ్య ధోరణిలో సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వాస్తవాలను వక్రీకరించి సినిమాలు తీస్తూ ఓ రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

