రంగారెడ్డి : షాద్నగర్ పరిధిలోని కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ గ్రామం వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బొలెరో వాహనం, టాటా ఏస్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు వాహనాల్లోనే ఇరుక్కుపోయారు. వీరిని బయటకు తీసేందుకు సుమారు 20 మంది రెండు గంటల పాటు శ్రమించారు. చివరకు జేసీబీ సహాయంతో వారిద్దరిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురికి కాళ్లు, చేతులు విరిగినట్లు పోలీసులు తెలిపారు.