Car Hit And Drag | విధుల్లో ఉన్న పోలీసును ఢీ కొట్టిన కారు.. గాల్లో ఎగిరి డివైడర్‌పై పడ్డ అధికారి.. VIDEO
Car Hit And Drag | పంజాబ్ (Punjab)లో దారుణం చోటు చేసుకుంది. చెక్‌పోస్ట్ (Checkpost) వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న ఓ పోలీసు అధికారిపైకి కారు దూసుకెళ్లింది.
Car Hit And Drag | పంజాబ్ (Punjab)లో దారుణం చోటు చేసుకుంది. చెక్‌పోస్ట్ (Checkpost) వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న ఓ పోలీసు అధికారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పోలీసు అధికారి తీవ్ర గాయాలపాలయ్యాడు.
జలంధర్‌లోని షాకోట్ ప్రాంతంలో గల సట్లేజ్ నదిపై హైటెక్ చెక్‌పోస్ట్ వద్ద ఓ పోలీసు అధికారి విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో మోగా రోడ్డు నుంచి వస్తున్న కారును ఆపాడు. కానీ, డ్రైవర్ కారు ఆపకుండా పోలీసును బలంగా ఢీ కొట్టాడు. దీంతో పోలీసు అధికారి గాల్లోకి ఎగిరి డివైడర్‌పై పడ్డాడు. ఘటన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ప్రమాదంలో సదరు పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఇతర అధికారులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. కాగా, ఘటనకు సంబంధించిన దృశ్యాలు చెక్‌పాయింట్ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
A person traveling in a white Zen car hit a Police Constable near Shahkot Checkpost (Jalandhar) when the police personnel tried to stop him for checking. The driver hit the cop and fled from the spot. #Punjab #Jalandhar pic.twitter.com/SLqNESVOfo
— Gagandeep Singh (@Gagan4344) January 12, 2024
Also Read..
Air India | మరో వివాదంలో ఎయిర్ ఇండియా.. వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలొచ్చాయంటూ మహిళ ట్వీట్
Coronavirus | దేశంలో 3,368కు చేరిన క్రియాశీల కేసులు
Sam Altman | బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

