లక్నో : యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజా ఘటనలో తొమ్మిదేండ్ల బాలికపై ఇద్దరు మైనర్ బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముజఫర్నగర్ జిల్లాలో కొద్ది రోజుల కిందట జరిగిన ఈ దారుణ ఉదంతంపై జనవరి 5న పోలీసులకు ఫిర్యాదు అందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తన ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన 10, 14 ఏండ్ల వయసున్న ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.