ముంబై : మద్యానికి బానిసైన ఓ భర్త నిత్యం తన భార్యతో గొడవపడేవాడు. ఎప్పటి మాదిరిగానే పీకల దాకా మద్యం సేవించి వచ్చాడు. తనకు బిర్యానీ వండలేదనే కోపంతో భార్యపై దాడి చేసి చంపాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఆగస్టు 31న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
లాతూర్ జిల్లాలోని కుస్తదం గ్రామానికి చెందిన విక్రమ్ వినాయక్ కొన్నేండ్ల నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఆగస్టు 31వ తేదీన విక్రమ్ పీకల దాకా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. డిన్నర్‌కు బిర్యానీ వండలేదని భార్యతో గొడవ పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న విక్రమ్.. కత్తితో భార్యను పొడిచి చంపాడు. బాధితురాలిని కాపాడేందుకు యత్నించిన స్థానికులపై కూడా కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు విక్రమ్. రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విక్రమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.