హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. స్థిరాస్తి వ్యాపారి నుంచి రూ.55లక్షలతో ఉడాయించాడు ఓ కారు డ్రైవర్. మరో వ్యాపారికి డబ్బులు ఇవ్వాలని వ్యాపారి కారు డ్రైవర్‌కు అప్పగించగా.. డబ్బు, కారుతో డ్రైవర్ శ్రీనివాస్ ఉడాయించాడు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌ను సిచ్ఛాఫ్ చేశాడు. దీంతో బాధిత వ్యాపారి సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాడు చేశాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. వ్యాపారి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు.