ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. రమేశ్‌ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి బుధవారం ఉదయం రమేశ్‌ను హతమార్చినట్లు మావోయిస్టు పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేశారు.
రమేశ్ పోలీస్ ఇన్ఫార్మర్గా మారి మావోయిస్టుల హత్యకు కుట్ర పన్నడంతోనే హత్య చేశామని లేఖలో పేర్కొన్నారు.