తక్కువ ధరకే గోల్డ్ కాయిన్స్ విక్రయిస్తామని రూ. కోటి కొట్టేశారు..!
తక్కువ ధరకు గోల్డ్ కాయిన్స్ విక్రయిస్తామని నవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రూ. 1.05 కోట్లు మోసగించారు.
ముంబై : తక్కువ ధరకు గోల్డ్ కాయిన్స్ విక్రయిస్తామని నవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు రూ. 1.05 కోట్లకు మోసగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీరజ్ ఖన్దగలే, నీతు కదం అనే నిందితులు బాధితుడిని సంప్రదించి భారీ స్కామ్కు తెరలేపారు.
తమకు గోవాలో గోల్డ్ కాయిన్స్తో నిండిన పాత్ర లభ్యమైందని, వీటిని తాము తక్కువ రేటుకు విక్రయిస్తామని నమ్మబలికారు. చౌక ధరలో గోల్డ్ కాయిన్స్ లభిస్తాయనే ఆశతో బాధితుడు 2022 మార్చి 2023 జులై మధ్య పలు వాయిదాల్లో రూ. 1.05 కోట్లు చెల్లించాడు.
పూర్తిస్ధాయిలో చెల్లింపులు జరిపినా బాధితుడికి నిందితులు గోల్డ్ కాయిన్స్ అప్పగించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఘరానా మోసం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Viral News | రీల్స్ చేసే మొగుడు…
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Cheaper Rate
- duped
- gold
- navi mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

