ముంబై : లైంగిక దాడి బాధితురాలిపై యాసిడ్ నింపిన బెలూన్ను విసిరిన వ్యక్తి ఉదంతం ముంబైలోని అంధేరి-ఘట్కోపర్ లింక్రోడ్లోని బిస్లరి జంక్షన్ వద్ద వెలుగుచూసింది. నిందితుడిపై తాను నమోదు చేసిన లైంగిక దాడి, దోపిడీ కేసును ఉపసంహరించుకోవాలని బెదిరిస్తూ ఈ దాడికి తెగబడ్డారని మహిళ ఆరోపించారు.
లైంగిక దాడి కేసును వెనక్కితీసుకోవాలని నిందితుడు అరుస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యాసిడ్ మహిళ కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ పోలీసులు, అటుగా వెళ్లే వ్యక్తులు ఆమెను దవాఖానకు తీసుకువెళ్లారు. యాసిడ్ దాడిపై బాధిత మహిళ అంధేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.