Man Swallows Gold | ఇంటి దగ్గర బాగా అప్పులు ఉండటంతో వాటిని ఎలా తీర్చాలో ఒక వ్యక్తికి అర్థం కాలేదు. దీంతో తను పనిచేసే మెటల్ రిఫైనరీ నుంచి కొంత బంగారం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. మామూలుగా అయితే దొరికిపోతాననే భయంతో 1.6 గ్రాముల బంగారాన్ని మింగేశాడు.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఐఎంటీ మనేసర్ ప్రాంతంలో జరిగింది. నిందితుడిని నదియా జిల్లాకు చెందిన సుబ్రతా బార్‌మన్‌గా గుర్తించారు. కంపెనీ నుంచి బయటకు వెళ్తుండగా ఎప్పట్లాగే మెటల్ డిటెక్టర్‌తో సెక్యూరిటీ గార్డు అతన్ని చెక్ చేశాడు. అది బీప్ బీప్ అంటూ శబ్దం చేసింది కానీ, బార్మన్ దగ్గర ఎటువంటి మెటల్ వస్తువులూ కనిపించలేదు.
దీంతో సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చింది. యాజమాన్యానికి ఈ విషయం చెప్పాడు. దీంతో బార్మన్ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్-రే తీయించారు. అప్పుడు అతని కడుపులో ఉన్న బంగారం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు బార్మన్పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ సందర్భంగా.. అప్పుల బాధ తట్టుకోలేకపోయానని, డబ్బు చాలా అవసరం అవడంతోనే ఈ తప్పు చేశానని బార్మన్ చెప్పాడు.