Online Scam | అధిక రిటన్స్ ఆశ చూపి రూ. 45.69 లక్షలు కొట్టేశారు
Online Scam : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ అడ్డాగా అమాయకుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నారు.
Online Scam : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్‌లు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్‌తో సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ అడ్డాగా అమాయకుల నుంచి భారీ మొత్తంలో దండుకుంటున్నారు. తాజాగా నవీ ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ స్కామ్‌లో ఏకంగా రూ. 45.69 లక్షలు పోగొట్టుకున్నారు. షేర్లలో పెట్టుబడులు పెడితే అధిక రిటన్స్ వస్తాయని మభ్యపెట్టిన స్కామర్లు బాధితుడిని నిండా ముంచారు.
సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి భారీ లాభాలు వస్తాయని నమ్మించి మార్చి 2 నుంచి ఏప్రిల్ 14 వరకూ రూ. 45.69 లక్షలు పెట్టుబడి పెట్టించి ఆపై ఉడాయించాడని బాధితుడు వాపోయాడు. తన పెట్టుబడులపై ఎలాంటి రిటన్స్ రాకపోగా అసలు మొత్తం కూడా స్కామర్లు కాజేశారని వెల్లడించాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
మొబైల్ నెంబర్లు, సోషల్ మీడియా ఐడీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలతో వచ్చేవారిని విశ్వసించవద్దని, స్కామర్ల మాటలు నమ్మి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత ఆర్ధిక సమాచారాన్ని కొత్త వ్యక్తలతో షేర్ చేయవద్దని చెబుతున్నారు.
Read More :
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- cyber fraud
- duped
- MAN
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

