న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ వ్యక్తి ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈశాన్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జిమ్ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. మృతుడిని గురుగ్రాంలోని ఓ కంపెనీలో పనిచేసే బీటెక్ గ్రాడ్యుయేట్ సాక్షం ప్రుతి (24)గా గుర్తించారు.
రోహిణిలోని సెక్టార్ 19లో నివసించే సాక్షం సెక్టార్ 15లోని జిమ్‌ప్లెక్స్ ఫిట్నెస్ జోన్లో ప్రతిరోజూ వర్కవుట్స్ చేస్తుండేవాడు. రోజూలానే మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అతడు జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు.
పోస్ట్‌మార్టం నివేదిక కూడా సాక్షం విద్యుత్ షాక్‌తోనే మరణించాడని ధ్రువీకరిచింది. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Alimony | భార్యకే కాదు.. శునకాలకూ భరణం ఇవ్వాల్సిందే.. భర్తను ఆదేశిస్తూ బాంబే కోర్టు తీర్పు