ఎర్రుపాలెం: మోటార్‌సైకిల్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఎర్రుపాలెం మండల పరిధిలో చోటుచేసుకున్నది. కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి పెగళ్లపాడు గ్రామంలోని తన ఇంటికి వెళ్తున్న యరమల కృష్ణారెడ్డి(41) పెగళ్ల పాడు బ్రిడ్జి సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పిన కిందపడటంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడుని వెంటనే అంబులెన్స్‌లో మధిర ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. భార్య వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.