ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్‌లో దొరికేస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని కొంత మంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో ఒక దొంగతనం జరిగింది. ఇంటికి కన్నం వేసిన దొంగ.. సుమారు రూ.10 లక్షల విలువైన నగలు, డబ్బు దొంగిలించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం.. నిందితుడు ఇతర రాష్ట్రాలకు పారిపోయి ఉంటాడని అనుమానించారు. ఈ క్రమంలోనే గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు పోలీసు బృందాలను పంపారు. ఇలా వెతుకుతుండగా ఉత్తరప్రదేశ్‌లో సదరు నిందితుడు.. పోలీసుల కంట పడ్డాడు.
అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. యూట్యూబ్‌లో ఎలా దొంగతనం చేయాలో చూశానని, ఆ ప్రకారమే చోరీ చేశానని నిందితుడు చెప్పాడు. ఆ మాటలు విన్న పోలీసులు కూడా షాకయ్యారు.