లక్నో : పద్నాలుగేండ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని బదోహి జిల్లాలో వెలుగుచూసింది. సెప్టెంబర్ 30న బాలిక అదృశ్యం కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు రోజుల తర్వాత బాలిక ఆచూకీ పసిగట్టి కాపాడిన పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు.
ప్రయాగరాజ్ జిల్లాకు చెందిన వ్యక్తి తనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడని మేజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్మెంట్లో పేర్కొంది. ప్రయాగరాజ్ జిల్లా వాహిద్నగర్ ప్రాంతంలో నిందితుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.